మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో నటుడిగా అడుగుపెట్టిన స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్

మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' షూటింగ్ లో నటుడిగా అడుగుపెట్టిన స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో పూరీ జగన్నాథ్ జాయిన్ అయ్యారు. ‘గాడ్ ఫాదర్’ సెట్స్ లో నటుడి గా అడుగుపెట్టిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, పూరీ జగన్నాథ్ కి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.”నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని, హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేసాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే ..మా పూరీ జగన్నాథ్ ని ‘గాడ్…