మూడు డిఫరెంట్ లుక్స్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’.. జనవరి 8న టీజర్ విడుదల

మూడు డిఫరెంట్ లుక్స్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’.. జనవరి 8న టీజర్ విడుదల

బింబిసార‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సత్తా చాటిన నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్ రామ్‌. ఈయ‌న మ‌రో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించ‌టానికి క‌ళ్యాణ్ రామ్ ఆస‌క్తి చూపిస్తుంటారు. త‌న‌దైన పంథాలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అమిగోస్’. డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేంద్ రెడ్డితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్నఈ చిత్రం టైటిల్ వినగానే అందరినీ ఆకట్టుకుంది. అమిగోస్ అంటే ఫ్రెండ్‌ను పిలిచే స్పానిష్ ప‌దం. రాజేంద‌ర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. రీసెంట్‌గానే రెండు లుక్స్ విడదల చేశారు. ఓ లుక్‌లో మెలివేసిన మీసాలతో…