సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న చిత్రం ‘భువన విజయమ్’. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి మే12న ‘భువన విజయమ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యం చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ధనరాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ పాత్ర. ప్రేక్షకుడి పాత్ర పోషించాను. సినిమాలోని పాత్రలని నేను ఎలా చూస్తానో ఆడియన్స్ కూడా అలానే చూస్తారని డైరెక్టర్ చెప్పారు. చాలా సవాల్ గా అనిపించింది. చాలా మంది నటీ నటులుతో ఈ సినిమా చేయడం అనందంగా వుంది. కంటెంట్…