ఏప్రిల్ 20-2022 రాత్రి రవీంద్రభారతిలో నేను శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో పాత్రికేయ శిరోమణి పురస్కారాన్ని అందుకున్నాను. అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ రఫీ ఫోన్‌చేసి, ఆ పురస్కారానికి నన్ను ఎంపిక చేసినట్లు చెప్పగానే, నిజంగా మొదట ఆ పురస్కారాన్ని అందుకోవడానికి నేను అర్హుడనేనా అనే ప్రశ్న వెంటనే మనసులో మెదిలింది. అంగీకారం తెలపడానికి సందేహించాను. జర్నలిస్టుగా, రచయితగా నా కెరీర్ ఎలా సాగుతూ వచ్చిందో, నేనేం రాశానో, నేనేం సాధించానో 1993 నుంచీ రఫీకి చాలావరకు తెలుసు. ఆ విషయం అతను చెప్పగానే సరేనన్నాను. ఈ సందర్భంగా నేనేమిటన్నది చాలావరకు తెలీని మిత్రులు, కొంతే తెలిసిన మిత్రులు చాలామందే ఉంటారు. వాళ్ల కోసమే ఈ నాలుగు (నాలుగంటే నాలుగు కాదనుకోండి) మాటలు… 22 సంవత్సరాల వయసులో.. 1993లో…
