‘బుట్ట బొమ్మ’ సినిమాలో కథే హీరో : సిద్ధు జొన్నలగడ్డ

'బుట్ట బొమ్మ' సినిమాలో కథే హీరో: సిద్ధు జొన్నలగడ్డ

గతేడాది ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలతో ఘన విజయాలను అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ఏడాదిని కూడా అంతే ఘనంగా ప్రారంభించబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘బుట్ట బొమ్మ’. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హైయత్ హోటల్ లో…