సంక్రాంతి సందర్బంగా హీరో మానస్, బిగ్ బాస్ ‘ఫేం’ కీర్తి భట్, నిఖిల్ ల ‘సంక్రాంతి తకథై’ పాట విడుదల

Sankranthi thakathai-still1

ప్రతి ఏటా సంక్రాంతి పండగ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. జనవరి వచ్చిందంటే చాలు మెదటి వారం నుండే షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతూ అందరికీ సంక్రాంతి సంబరాలు ముందే స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది. సంక్రాంతి వచ్చిందంటే కోడిపందేలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, రేగి పళ్ళు, కొత్త అల్లుళ్ళు, బోగి మంటలు, గాలి పటాలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ఈ సంబరాలకు సినిమాలు కూడా తోడవ్వడంతో ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, మరో వైపు నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలతో పాటు అనేక సినిమాలు ఈ సంక్రాంతి బరిలో దిగుతున్న సమయంలో ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేందుకు రెడ్ సెడార్ ఎంటర్టైన్మెంట్ వారు ముందుకు వచ్చి పండగ వాతావరణం ఉట్టి పడేలా…