దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. మార్చి 3న విడుదలైన చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సక్సెస్‌పై ప్రియదర్శి మీడియాతో మాట్లాడిన ఇంటర్వ్యూ విశేషాలు… – ‘బలగం’ సినిమా చూసిన నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ‘మల్లేశం’ వంటి మూవీ తర్వాత మరో మంచి సినిమా చేశావని అందరూ అప్రిషియేట్ చేశారు. – చాలా మంది రెండు, మూడు సార్లు చూసిన వాళ్లు ‘బలగం’ ఓ గొప్ప సినిమా అని అన్నారు. థియేటర్స్‌లో ఏడ్చినప్పటికీ సంతోషంగా బయటకు వస్తున్నారు.…