ఎస్‌ఎమ్ ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నూతన తారలతో వైవిధ్యమైన జానర్‌లో.. ఎమ్‌ఎన్‌వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్‌ను తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘కాలం రాసిన కథలు టైటిల్ చాలా బాగుంది. అలాగే సాగర్ రాసిన డబ్బు విలువ తెలియజేసే సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి సాగర్‌కి మరియు చిత్రంలో నటించిన నటీనటులు అలాగే పనిచేసిన టెక్నీషియన్లకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని అన్నారు. ‘‘నంధ్యాల నుంచి హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశాల కోసం తిరుగున్న టైమ్‌లో నాకు ‘కాలం రాసిన కథలు’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన…
