హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదిక వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికి రాష్ట్ర సాధన కోసం చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, నిస్పృహలో ఉన్న తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా రాష్ట్రాన్ని సాధిస్తానని కేసీఆర్ ముందడుగు వేశారని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఇంతితై వటుడింతై అన్నట్లు 2001 నుంచి నేటి వరకు 21 ఏండ్లుగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన సిద్దాంత పార్టీగా పేరుగాంచిందన్నారు.…
