మంత్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో నగేష్ నారదాసి దర్శకత్వంలో అప్సర రాణి ప్రధాన పాత్రలో “తలకోన” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి గుర్తుందా శీతాకాలం నిర్మాత రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా… ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు. ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘తలకోన’ చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ… ఈ రోజే చిత్రాన్ని ప్రారంభించాము. చాలా సినిమాలతో నేను మీకు సూపరిచమే.. ఇప్పుడు ఈ ‘తలకోన’ చిత్రంతో మరోసారి మీ ముందుకు వస్తున్నా. క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది.…
