‘నెల్లూరి నెరజాణ’ టీజర్‌, ఫస్ట్‌లుక్‌ విడుదల

‘నెల్లూరి నెరజాణ’ టీజర్‌, ఫస్ట్‌లుక్‌ విడుదల

చిగురుపాటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎం.ఎస్. చంద్ర, హరిలు హీరోలుగా అక్షఖాన్‌ హీరోయిన్‌గా చిగురుపాటి సుబ్రమణ్యం రచన, సాహిత్యం, స్క్రీన్‌ప్లేతో స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. ‘ఓ అందగత్తె ప్రేమకథ’ అనేది ట్యాగ్‌లైన్‌. 175 మందికి పైగా కొత్త వారితో, ఐదుగురు ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లతో నిర్మించిన ఈ చిత్రం టీజర్‌, ఫస్ట్‌లుక్‌ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. స్టార్‌ డైరెక్టర్‌ మహానటి ఫేం, ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా ‘ప్రాజెక్ట్‌ కె’ పేరుతో అత్యంత భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నాగ్‌ అశ్విన్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి టీజర్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగ్‌ అశ్విన్‌ను చిత్ర యూనిట్‌ మేళ,తాళాలతో వేదిక వద్దకు తోడ్కొని వచ్చి, గజమాలతో సత్కరించారు. Nelluri Nerajana అనంతరం నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ… చిగురుపాటి సుబ్రమణ్యం నా దగ్గర…