Tiger nageswara rao telugu movie review : ఆకట్టుకునే ‘టైగర్ నాగేశ్వరరావు’

Tiger nageswara rao telugu movie review : Impressive 'Tiger Nageswara Rao'
Tiger nageswara rao telugu movie review : Impressive 'Tiger Nageswara Rao'
Spread the love

టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా నటించిన చతాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. సినిమా విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు (20, అక్టోబర్- 2023) ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తడానికి థియేటర్లల్లో అడుగుపెట్టింది. మరి.. అనుకున్న అంచనాలను ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం….
కథ : దొంగతనాలే వృత్తిగా కాలం గడుపుతుంటారు స్టూవర్టుపురం ప్రాంతంలోని ప్రజలంతా. వారి ఆకలిని, అవసరాలను అవకాశంగా చేసుకుని.. అక్కడి అధికారులు వారిని తమకు అనుగుణంగా వాడుకుంటూ దోచుకుంటూ ఉంటారు. అంతటితో ఆగకుండా వారిని అణిచివేస్తుంటారు. ఇవన్నీ చూసి పెరిగిన నాగేశ్వరరావు (రవితేజ) తన స్టూవర్టుపురం ప్రజల బాగు కోసం ఏం చేశాడు? ఆయా పరిస్థితులపై ఎలాంటి పోరాటం చేశాడు? ఈ క్రమంలో స్టూవర్టుపురం నాగేశ్వరరావు నుంచి టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు? ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు యుక్త వయసులో ఉన్నప్పుడు సారా (నుపుర్ సనన్)తో ఎలా ప్రేమలో పడ్డాడు?, చివరకు టైగర్ నాగేశ్వరరావు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?, ఇంతకీ నాగేశ్వరరావు తాను అనుకున్నది సాధించాడా.. లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
ఎలావుందంటే… సినిమా ఆద్యంతం ఆకట్టుకునే రీతిలోనే సాగింది. 1970 – 80వ దశకంలో కథ సాగుతున్నప్పుడు అప్పటి నేటివిటీని దృష్టిలో పెట్టుకొని సన్నివేశాలను చిత్రీకరించిన విధానం బావుంది. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్రను మొదట్లో చూపించిన ఎలివేషన్స్.. దర్శకుడు సినిమా మొత్తం ఆకర్షించేలా చేయలేకపోయాడు. ఇక మధ్య మధ్యలో వచ్చే ప్రేమ సన్నివేశాలు కథ ప్లోకి అడ్డు పడ్డాయి. దర్శకుడు వంశీ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించిన తీరు మాత్రం వాహ్.. అనిపించింది. ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకులు మెచ్చేలా చాలా బాగా తెరకెక్కించాడు. రవితేజ తన కెరీర్ లో ఒక ఛాలెంజ్ గా ఈ పాత్రలో నటించిన విధానం అందర్నీ మెప్పిస్తుంది. తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో రవితేజ కొత్త లుక్స్ తో చాలా ఫ్రెష్ గా కనిపించాడు. ఇది ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా నడిచిన కథ. స్టూవర్టు పురంలో టెర్రర్ రాజ్యంపై ఆధిపత్యం చెలాయించి, తన వాళ్లకు జీవితాన్ని ఇచ్చిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా నడిచిన ఈ కథలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని ఎమోషన్స్, అలాగే సాహసోపేతమైన దోపిడీ సన్నివేశాలతో పాటు, నటీనటులు పనితనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ఆద్యంతం ఆకట్టుకునే రీతిలోనే సాగింది. ఇక హీరోయిన్ గా నటించిన నుపుర్ సనన్ తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు బేషుగ్గా ఉన్నాయి. మరో హీరోయిన్ గా చేసిన గాయత్రి భరద్వాజ్ కూడా ఓకే అనిపించి తన నటనతో మెప్పించింది. హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్‌ జీవించేసింది. అనుపమ్ ఖేర్, నాజర్, మురళీశర్మ తమ తమ పాత్రల పరిధి మేరకు పూర్తి న్యాయం చేశారు. జిస్సు సేన్‌గుప్తా మరో ముఖ్యమైన పాత్రలో బాగా నటించాడు. అలాగే మిగిలిన నటీనటులు ఓకే అనిపించేలా నటించారు. అయితే.. టైగర్ నాగేశ్వరరావు లో మెయిన్ కంటెంట్ అండ్ రవితేజ పెర్ఫార్మెన్స్, మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ బాగున్నా.. ట్రీట్మెంట్ విషయంలో కొన్ని చోట్ల బాగా స్లో అనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ ను కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు గాని, కొన్ని చోట్ల అది ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.
టెక్నీకల్ గా చూస్తే… మధి సినిమాటోగ్రఫీ మెచ్చుకునేలా సాగింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఓకే అనిపించింది. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకే హైలెట్ గా నిలిచింది. దర్శకుడు వంశీ మంచి కథను తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఉత్కంఠభరితమైన కథనాన్ని రూపొందించడంలో, దాన్ని అంతే ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో సక్సెస్ కాలేక పోయాడు. సినిమాకు పనిచేసిన సాంకేతిక టీమ్ పనితనం బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు పనితనం మెచ్చుకునే స్థాయిలోనే ఉంది. అభిషేక్ అగర్వాల్ నిర్మాణ సినిమా స్థాయిగా తగ్గట్టుగానే ఉన్నాయి. మొత్తం మీద సినిమా ఎమోషనల్ తో సాగి యాక్షన్ డ్రామాగా అందర్నీ అలరిస్తుంది.
(చిత్రం : టైగర్ నాగేశ్వరరావు, విడుదల తేదీ : 20, అక్టోబర్- 2023, రేటింగ్ : 2.75/5, నటీనటులు: రవితేజ, అనుపమ్ ఖేర్, గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, నాజర్, మురళీశర్మ, జిస్సు సేన్‌గుప్తా, సుదేవ్ నాయర్, హరీష్‌పెరాడి తదితరులు. దర్శకత్వం : వంశీ, నిర్మాత: అభిషేక్ అగర్వాల్, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ: ఆర్. మధి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు)