నాటకానికి మహర్దశ : తనికెళ్ల భరణి .. ఈ అవకాశం నాటక నటులకు ఆస్కార్‌ అవార్డుతో సమానం

నాటకానికి మహర్దశ : తనికెళ్ల భరణి -ఈ అవకాశం నాటక నటులకు ఆస్కార్‌ అవార్డుతో సమానం...

‘‘పూర్వం నాటకాలను పోషించేవారిని మహారాజు శ్రీ కృష్ణదేవరాయలుతో పోల్చేవారు. ఈ రోజుల్లోను ఇంకా కృష్ణదేవరాయల కాలం నాటి మహారాజ పోషకులు సీఆర్‌సి కాటన్‌ కళా పరిషత్‌ రూపంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ప్రముఖ దర్శకులు ఎస్వీ. కృష్ణారెడ్డిగారు 23ఏళ్ల క్రితం భరణిగారు నేను బిజీగా ఉన్నాను ఓ సారి మీరు రావులపాలెం సీఆర్‌సిక్లబ్‌కి వెళ్లి ఓ కార్యక్రమానికి అటెండ్‌ అవ్వాలి అంటే సరే కదా అని వెళ్లాను. తర్వాత సీఆర్‌సి ఫౌండేషన్‌ వారు చేస్తున్న అనేక రకాలైన సేవ కార్యక్రమాలను చూసి షాకయ్యాను. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మీరు నాటక కళా పరిషత్‌ను స్థాపించి మంచి నాటకాలు వేయించొచ్చు కదా అన్నాను. అప్పుడు వారు సదుపాయలు ఏం కావాలన్నా మేము చేస్తాం కాని, నాటకానికి సంబంధించిన కార్యక్రమాలను మీరు దగ్గరుండి చూసుకుంటే నాటక పరిషత్‌ నిర్వహించటానికి…