అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పబ్లిసిటీ కంటెంట్ కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో కథ కంచికి మనం ఇంటికి చిత్రాన్ని ఏప్పిల్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్ లో యూనిట్ సభ్యలు పాల్గొన్నారు. నిర్మాత మోనిష్ పత్తిపాటి మాట్లాడుతూ.. కథ కంచికి మనం ఇంటికి కథ డైరెక్టర్ చాణిక్య చిన్న నాకు నెరేట్ చేసినప్పడు చాలా కొత్తగా అనిపించింది. హారర్ కామెడీ జానర్ లో ఇప్పటికే చాలా సినిమాలు విడుదలైనప్పటికీ కథ కంచికి మనం ఇంటికి సినిమా చాలా భిన్నంగా ఉంటూ…
