”ది కాశ్మీర్ ఫైల్స్’ తో సంచలన సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ది వాక్సిన్ వార్’ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకం పై పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కీలక పాత్ర పోహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం సెట్ లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా నటి పల్లవి జోషి గాయపడ్డారు. ఓ వాహనం అదుపు తప్పి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సమీపంలోని హాస్పిటల్ లో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే వుందని, అభిమానులెవరు అందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర బృందం తెలియజేసింది. ది వాక్సిన్ వార్ లో…
