‘తెలుసా మనసా’ నుంచి ‘మనసు మనసుతో..’ మెలోడి సాంగ్ విడుదల

‘తెలుసా మనసా’ నుంచి ‘మనసు మనసుతో..’ మెలోడి సాంగ్ విడుదల

‘కేరింత’ ఫేమ్ పార్వ‌తీశం, జ‌ష్విక జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘తెలుసా మనసా’. న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్‌స్టోరిగా ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వ‌ర్షా ముండాడ, మాధ‌వి నిర్మించారు. వైభ‌వ్ ద‌ర్శ‌కుడు. పార్వ‌తీశం ప‌ల్లెటూర్లో బెలూన్స్ అమ్ముకునే కుర్రాడు మ‌ల్లి బాబు పాత్ర‌లో న‌టించారు. హెల్త్ అసిస్టెంట్ సుజాత పాత్ర‌లో జ‌ష్విక న‌టించింది. వారిద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి చెప్ప‌లేనంత ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని బ‌య‌ట‌కు చెప్పుకోలేరు. మ‌రీ ముఖ్యంగా మ‌ల్లిబాబు అయితే ప‌లు సంద‌ర్భాల్లో సుజాత‌కు త‌న ప్రేమ‌ను చెప్ప‌టానికి ప్ర‌య‌త్నించి చెప్ప‌లేక‌పోతాడు. అయితే ఇద్ద‌రూ అనుకోని కార‌ణాల‌తో దూర‌మ‌వుతారు. మ‌రి వాళ్లిద్ద‌రూ క‌లుసుకున్నారా? అనేది ‘తెలుసా మనసా’ సినిమా క‌థాంశం. మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి ‘మనసు మనసుతో..’ అనే మెలోడి సాంగ్ విడుద‌లైంది. వాల్తేరు వీర‌య్య‌తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన…