దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్ మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్. `దబాంగ్3` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె `గని` సినిమాతో తెలుగులోకి రంగ ప్రవేశం చేసింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సయీ మంజ్రేకర్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించారు… టాలీవుడ్ అంటే ప్రత్యేక అభిమానం.. -టాలీవుడ్‌లో అల్లు అర్జున్, పవన్, రామ్‌చరణ్ అంటే ఇష్టమని చెప్పారు. తెలుగు సినిమాలు కూడా చూస్తానని, రామ్‌చరణ్ నటించిన `మగధీర` ఎంతో బాగా నచ్చిందని, అలాగే బన్నీ నటించిన `పుష్ప` సినిమాకి ఫిదా అయిపోయినట్టు పేర్కొన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. ఆయన నటించిన `వకీల్‌సాబ్` చూశానని తెలిపారు.…
