వరుణ్ కృష్ణ ఫిల్మ్స్ బ్యానర్ పై శేషుదేవరావ్ మలిశెట్టి నిర్మాణంలో శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నువ్వే నా ప్రాణం!. కిరణ్‌రాజ్, ప్రియాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, భానుచందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని డిసెంబర్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. విలేఖరుల సమావేశంలో… చిత్ర నిర్మాత శేషుదేవరావ్ మల్లిశెట్టి మాట్లాడుతూ… మొట్ట మొదటిసారి సినిమా రంగంలో అడుగుపెట్టాము. మమ్మల్ని ఆదరించి మా సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మా చిత్రంలో సుమన్, భానుచందర్ లాంటి లెజండ్స్ నటించారు. ఎన్నో చిత్రాల్లో నటించిన వాళ్ళ దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది అన్నారు. దర్శకుడు శ్రీకృష్ణ మల్లిశెట్టి మాట్లాడుతూ… ఈ చిత్రం ఒక ప్యాషన్‌తో తీయలేదు.…
