ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న ‘మినిమం గ్యారంటీ మూవీస్’ అధినేత ఎమ్.అచ్చిబాబు కె.జి.ఎఫ్ తో కాలరెగరేసిన కన్నడ చిత్రసీమ “కాంతారా”తో తన ప్రతిష్టను మరింత పెంచుకోవడం అందరికీ తెలిసిందే. కన్నడనాట తాజాగా ఈ కోవలో మరో చిత్రం చేరింది. “కలివీర” పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధిస్తూ… రికార్డు స్థాయి వసూళ్లతో కన్నడ ఖ్యాతిని మరింత సుస్థిరం చేస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ సంచలన విజయం సాధించేందుకు “కలివీరుడు”గా మన ప్రేక్షకుల ముందుకు వస్తోంది!! ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని అత్యంత ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని… “మినిమం గ్యారంటీ మూవీస్” పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. “అవి” దర్శకత్వంలో… రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో…