తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎస్ 5 నో ఎగ్జిట్’. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు దర్శక నిర్మాతలు భరత్ కోమలపాటి, నిర్మాత గౌతమ్ కొండెపూడి దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ….నేను 2004లో ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో హీరో కావాలనే ఆలోచన ఉండేది. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో నేను చేసిన డాన్సులు చూసి బాగా డాన్సులు చేస్తున్నావు అని…