శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యం లో గత రెండు దశాబ్దాల నుంచి ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలను 2022వ సంవత్సరం కోసం ప్రకటించారు. శృతిలయ చైర్మన్ డాక్టర్ బి.భీమ్ రెడ్డి, ఆమని, సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండీ బండారు సుబ్బారావు తో కలసి అవార్డ్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ ఆయా వివరాలు వెల్లడించారు. ప్రముఖుల సమక్షం లో ఈ నెల 20 వ తేది సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి లో పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. శృతిలయ – సీల్ వెల్ ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారం శ్రీమతి ఎం.శైలజ సుమన్ , పూర్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్, అల్ ఇండియా రేడియో ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు…
