‘ఇన్ కార్’ అందరూ చూడాల్సిన సినిమా : రితిక సింగ్

‘ఇన్ కార్’ అందరూ చూడాల్సిన సినిమా : రితిక సింగ్

నేషనల్ అవార్డ్ విన్నర్, ‘గురు’ సినిమా ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్‌’. ఇన్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఇన్ కార్’ మార్చి 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేట్రికల్‌ గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్బంగా రితిక సింగ్ మాట్లాడుతూ : ‘ఇన్ కార్’ చాలా సీరియస్, కంప్లీట్…