– అందమైన అనుభూతికి లోను చేస్తోన్న‘శాకుంతలం’ రిలీజ్ ట్రైలర్ – అనిర్వచనీయమైన ప్రేమ, భావోద్వేగాల కలబోత ”లేడీ కన్నులు, నెమలి నడక, సివంగి నడుము మనసుల పరిచయం కంటే మనుషుల పరిచయం గొప్పదా ఏం మనసెటు పోతే అటు పోరాదని ముని వాక్కు నీ కష్టానికి కన్నీళ్లు పెట్టగలమే కానీ.. కర్మను పంచుకోలేం పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను..మీ ప్రేమకు కూడా దూరమైతే ..” – వంటి అద్భుతమైన సంభాషణలు.. అంతకు మించి కళ్లు ఆనందంతో విప్పారే సన్నివేశాలు ఇవన్నీ కలబోసిన చిత్రమే ‘శాకుంతలం’ అని రిలీజ్ ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. ప్రతి సన్నివేశాన్ని కుంచెతో బొమ్మ గీసినట్లు అద్భుతంగా తెరకెక్కించారు ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్. మహాభారతంలోని అద్భుతమైన ప్రేమ కథగా మనం చెప్పుకునే దుష్యంత, శకుంతల ప్రేమగాథను మహా కవి కాళిదాసు…