అంతర్జాతీయ కవి సమ్మేళనానికి బండిరాజుల శంకర్ ఎంపిక

అంతర్జాతీయ కవి సమ్మేళనానికి బండిరాజుల శంకర్ ఎంపిక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ కవితల పోటీలు” నిర్వహించింది. ఈ పోటీలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన కవి బండిరాజుల శంకర్ ఎంపికయ్యారు. ఏప్రిల్ 23 న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద బండిరాజుల శంకర్ తమ కవితను వినిపించబోతున్నారు. భారత దేశ ఉనికిని చాటి చెబుతూ భావయుక్తంగా వారు రాసిన ‘మానవత్వం నా ఉనికి’ అనే కవిత ఈ పోటీలో ఎంపికయింది. ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి రావు, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ…