స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ‘అరి’ సినిమా నుంచి ‘భగ భగ..’ లిరికల్ సాంగ్ రిలీజ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

Star director Nag Ashwin releases lyrical song 'Bhaga Bhaga..' from the movie 'Ari', the movie is getting ready for a grand theatrical release soon
Spread the love

ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల Ph.D నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ రోజు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘అరి’ సినిమా నుంచి ‘భగ భగ..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘భగ భగ..’ లిరికల్ సాంగ్ చాలా బాగుందన్న నాగ్ అశ్విన్…మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు. ఈ పాటను అనూప్ రూబెన్స్ ఫైర్ ఉన్న బీట్ తో కంపోజ్ చేయగా..వనమాలి పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు. షణ్ముక ప్రియ, రోహిత్ పీవీఎన్ఎస్ ఇంటెన్స్ గా పాడారు. ‘భగ భగ..’ సాంగ్ ఎలా ఉందో చూస్తే – ‘మనిషేనా నువ్వు, ఏమైపోతున్నావు, మృగమల్లె మారి దిగజారి పోయావు, భగ భగ భగ భగ మండే నీలో ఏదో సెగ, అంతులేని ఏంటి దగా, మనిషేనా నువ్వు, ఏమైపోతున్నావు, మృగమల్లె మారి దిగజారి పోయావు..’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అనౌన్స్ చేయనుంది.
నటీనటులు – వినోద్ వర్మ , సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు.
టెక్నికల్ టీమ్
మ్యూజిక్ : అనుప్ రూబెన్స్
ఎడిటర్ : జి. అవినాష్
లిరిక్స్ : కాసర్ల శ్యాం, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి,
కొరియోగ్రఫీ – భాను, జీతు
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్
స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సిరి చందన
సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్
లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వినయ్
పి.ఆర్.ఓ – జి యస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
సమర్పణ : ఆర్ వీ రెడ్డి
నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల Ph.D
రచన –దర్శకత్వం : జయశంకర్

Related posts

Leave a Comment