శ్రీరస్తు.. శుభమస్తు: ఘనంగా వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠీ పెళ్లి

Srirastu.. Shubhamastu: Varuntej and Lavanya Tripathi's wedding
Spread the love

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వెండితెరపై నటించి, ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఆరేళ్ల తమ ప్రేమను ఇటలీలోని టస్కానీ వేదికగా వివాహబంధంగా మార్చుకున్నారు.బుధవారం రాత్రి ఏడు గంటల పద్దెనిమిది నిముషాలకు లావణ్య మెడలో వరుణ్‌తేజ్‌ మూడు ముళ్లూ వేశారు. ఇరువైపు కుటుంబాల సభ్యులు, అతి తక్కువమంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, అల్లు శిరీశ్‌ ఈ పెళ్లిలో సందడి చేశారు. అలాగే హీరో నితిన్‌ భార్య షాలినీతో కలసి ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ నెల 5న హైదరాబాద్‌లోని ఎన్‌. కన్వెన్షన్‌లో వరుణ్‌తేజ్‌, లావణ్యల రిసెప్షన్‌ జరుగుతుంది. వరుణ్, గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ఉన్నారు. అందులో భాగంగా జూన్‌ 09న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరైయ్యారు.
ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ముకుందాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఆ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఆ సినిమాలో వరుణ్ తన నటనతో అదరగొట్టాడు. ఆ తర్వాత మరో ప్రయోగం కంచె. ఈ సినిమాను క్రిష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో విజయం సాధించింది. అంతేకాదు సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డు కూడా వచ్చింది. అక్కడి నుంచి వరుణ్ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ వస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ లేటెస్ట్‌గా గాంఢీవధారి అర్జున అనే సినిమా చేశారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వరుణ్.. పలాస ఫేమ్ కరుణ కుమార్‌తో మరో చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాకు మట్కా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ఫైనల్ అయ్యింది. విశాఖపట్నం నేపథ్యంలో 1960లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా వస్తోందట. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

Related posts

Leave a Comment