వరుస ఆఫర్లతో శ్రీలీల బిజీబిజీ!

Srileela is busy with a series of offers!
Srileela is busy with a series of offers!
Spread the love

ఏ హీరోయిన్‌ కీ దక్కని అదృష్టం శ్రీలీలకు దక్కింది. వరసగా ఆఫర్లు ఆమెకు క్యూ కడుతున్నాయి. స్టార్‌ హీరో, యంగ్‌ హీరో అనే తేడా లేకుండా అందరి పక్కన ఛాన్స్‌ కొట్టేసింది. ఆమె ఎంపికైన సినిమాలన్నిం టిలోనూ వరసగా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వాటిలో కొన్ని షూటింగ్స్‌ పూర్తి కాగా, అవి విడుదలకు రెడీ అవుతున్నాయి. విడుదలకు రెడీగా ఉన్న చాలా సినిమాల్లో శ్రీలీల హీరోయిన్‌ గా నటించింది. చాలా మంది హీరోలు తమ సినిమాలను పెద్ద పండగల సమయంలో విడుదల చేయాలని అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో విడుదల చేసి, మూవీకి పాజిటివ్‌ టాక్‌ వస్తే, కాసుల వర్షం కురవడం ఖాయం అని నమ్ముతుంటారు. పెద్ద హీరోల సినిమాలు దాదాపు పండలకే విడుదల అవుతాయి. ఇప్పుడు ఐదుగురు హీరోలు ఐదు పెద్ద పండలను టాª`గ్గంªట్‌ చేశారు. ఇప్పుడు ఐదు పండగలకు విడుదలయ్యే సినిమాల్లో హీరోలు మారినా, హీరోయిన్‌ మాత్రం శ్రీలీల కామన్‌. ఇలాంటి అరుదైన ఫీట్‌ ఏ హీరోయిన్‌ కి దక్కలేదేమో. ముందు వినాయక చవితి పండగకు స్కంద మూవీ విడుదల అవుతోంది. రామ్‌ హీరో కాగా, శ్రీలల హీరోయిన్‌. ఈ సినిమా బోయపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ంబెనీ ఖీ।జీట ` బికినీ తో పిచ్చెక్కిస్తున్న హాట్‌ బ్యూటీ ఇక, ఆ తర్వాతి పండగ దసరా. ఈ పండగకు భగవంత్‌ కేసరి విడుదల అవుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ హీరోగా చేస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ మూవీలో శ్రీలల కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్ర ఆధారంగానే సినిమా ఉంటుందని తెలుస్తోంది. కాజల్‌ మరో హీరోయిన్‌. ఆ తర్వాతి పండగ దీపావళి. ఈ పండగకు యంగ్‌ హీరో, మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఆది కేశవ మూవీ విడుదల అవుతుంది. ఈ మూవీలోనూ హీరోయిన్‌ శ్రీలీలే కావడం విశేషం. ఇక, ఆతర్వాత క్రిస్మస్‌ పండగ రానుంది. ఆ సమయంలో నితిన్‌ ఎక్స్‌ ట్రాడ్నరీ మూవీ విడుదల అవుతుంది. ఈ మూవీలో నితిన్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. ఆ తర్వాత తెలుగువారి అతి పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగకు ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గుంటూరు కారం విడుదల కానుంది. ఈ మూవీలో మహేష్‌ సరసన కూడా శ్రీలీల నటిస్తోంది. పూజ హెగ్డే చేయాల్సిన రోల్‌, శ్రీలీలకు దక్కింది. ఈ కారణం చేతనే ఈ మూవీ ఆలస్యమౌతూ వచ్చింది.