మెగాస్టార్ చిరంజీవికి రోజా రమణి దంపతుల శుభాకాంక్షలు

Roja Ramani couple wishes to Megastar Chiranjeevi
Roja Ramani couple wishes to Megastar Chiranjeevi
Spread the love

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాన్ని ప్రకటించినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇప్పటికే సినీ, మీడియా రంగాల వారు మాత్రమే కాకుండా చిరంజీవిని అభిమానించేవారు, ఆయన శ్రేయోభిలాషులు అంటే దాదాపు అన్ని రంగాల వారు ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి రోజా రమణి, ఆమె భర్త నటుడు చక్రపాణి అలాగే టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్ కలిసి పుష్ప గుచ్చాన్ని అందించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.