సినిమాగా శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథ ‘నాగలాదేవి’

Srikrishna Devaraya's love story 'Nagaladevi' as a movie
Spread the love

సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథ రాసిన చారిత్రక నవల ‘నాగలాదేవి ‘ ఈ శతాబ్దపు గొప్ప ప్రేమ కావ్యమని, సినిమాగా తీస్తే రాయలు , నాగలాదేవి అనిర్వచనీయమైన ప్రేమ కథ ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందని పలువురు వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ , రఘు అరికపూడి సేవా ట్రస్ట్ సంయుక్తంగా భగీరథ రచించిన ‘నాగలాదేవి ‘ నవల సమీక్షా సమావేశం చిక్కడపల్లి కళాభారతి లో జరిగింది .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశ్రాంత ఇన్ కమ్ టాక్స్ చీఫ్ కమీషనర్ ఎమ్ . నరసింహప్ప, సభాధ్యక్షులుగా డాక్టర్ బిక్కి కృష్ణ, వక్తలుగా డాక్టర్ నాళేశ్వరం శంకరం , డాక్టర్ బీరం సుందర్రావు, డాక్టర్ జ్యోత్న ప్రభ, డాక్టర్ జెల్ది విద్యాధర్ విచ్చేశారు .
విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఇంత ఉత్తేజకరమైన ప్రేమ కథ ఉందని ఎవ్వరికీ తెలియదని , భగీరథ గారు 15 సంవత్సరాలు పరిశోధించి రాసిన ‘నాగలాదేవి’ చదువుతుంది సినిమా చూస్తున్నట్టే ఉందని , దృశ్యం తరువాత దృశ్యం మన కళ్ళముందు మెదులుతుంది , ఇందులో నవరసాలు మిళితమై ఉన్నయని , ముఖ్యంగా రాయచూర్ యుద్ధం చాలా ఉత్కంఠంగా ఉంటుందని, ఈ నవలను సినిమా నిర్మిస్తే ఘన విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా వ్యక్తలు కొనియాడారు .
రచయిత భగీరథ మాట్లాడుతూ .. 2007 లో జగపతి బాబు , అనుష్క , భూమిక తో నిర్మించిన ‘స్వాగతం’ సినిమాకు నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేశాను . ఈ సినిమాలోని ‘మనసా మౌనమా ‘ అన్న పాటను హంపిలో చిత్రీకరించాము . అప్పుడు మొదటిసారి హంపి చూశాను . ఆ శిథిలమైన మహానగరం విజయ నగరాన్ని చూసిన తరువాత దక్షిణ భారత చరిత్రపై పరిశోధన చెయ్యడం మొదలు పెట్టానని , శ్రీకృష్ణదేవరాయల రెండవ భార్య చిన్నాదేవి, ఆమె అసలు పేరు నాగలాదేవి అని , ఆమె ప్రేమ కథ వ్రాశానని చెప్పారు .

Related posts

Leave a Comment