శృతి హాసన్ వాయిస్ తో సైలెంట్ స్క్రీమ్స్ – సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్

Silent Screams with Shruti Haasan's voice – streaming on Sun Next
Spread the love

తెలంగాణలోని యథార్థ సంఘటనలపై ఆధారిత కేసులను వెలుగులోకి తీసుకొచ్చిన శక్తివంతమైన క్రైమ్ డాక్యుమెంటరీ మహిళలపై నేరాలు కేవలం సంఖ్యలుగా మారిపోతున్న కాలంలో, ఆ సంఖ్యల వెనుక ఉన్న మనుషుల కథలను చెప్పేందుకు సన్ నెక్స్ట్ తీసుకొచ్చింది ‘సైలెంట్ స్క్రీమ్స్’. వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ క్రైమ్ డాక్యుమెంటరీ, నేరాల ప్రభావం ఎంత లోతుగా కుటుంబాలు, సమాజాలపై పడుతుందో హృదయాన్ని తాకే విధంగా ఆవిష్కరిస్తుంది. శృతి హాసన్ వాయిస్ నరేషన్‌తో సాగిన ఈ సిరీస్, కేవలం నేరాల వివరాలకే పరిమితం కాకుండా, న్యాయం కోసం సాగే పోరాటాన్ని, బాధితుల మౌన వేదనను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. సంక్రాంతి పండుగ వేళ, జిగ్రీస్, ముఫ్తీ పోలీస్ వంటి వినోదాత్మక కంటెంట్‌తో పాటు, ఆలోచన రేపే ఈ డాక్యుమెంటరీని అందిస్తూ సన్ నెక్స్ట్ తన వైవిధ్యాన్ని చాటుతోంది. 4,000+ టైటిల్స్, 44+ లైవ్ ఛానళ్లతో, సన్ నెక్స్ట్ అన్ని వయసుల ప్రేక్షకులకు ఒకే వేదికగా నిలుస్తోంది.

Related posts