సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘3 BHK’. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ వచ్చింది.
ఫస్ట్ సింగిల్ కలలన్నీ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. తాజాగా సెకండ్ సింగిల్ ఆగిపోను నేను రిలీజ్ చేశారు.
అమృత్ రామ్‌నాథ్ సాంగ్ ని ఇన్స్పైరింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. దేవా ఈ సాంగ్ కు భావోద్వేగభరితమైన లిరిక్స్‌కు అందించడంతో పాటు డైనమిక్ ర్యాప్ పాడి అదరగొట్టారు.
ఈ సాంగ్ పాత్రల పట్టుదల, ధైర్యానికి అద్దం పట్టినట్లుంది. డాన్సింగ్ నింజాస్ రూపొందించిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంటుంది. వీడియోల్లో ఒక మధ్య తరగతి కుటుంబం ఎదుర్కొనే ప్రతిరోజూ కష్టాలు ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశారు. శరత్ కుమార్ ధైర్యవంతమైన తండ్రిగా, సిద్ధార్థ్ కుటుంబ ఆశల బరువును మోస్తూ మంచి భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న కొడుకుగా కనిపిస్తారు. ఇల్లు కొనాలన్న అతని కల ఈ పాటకు ప్రాణంగా నిలుస్తుంది.
“ఆగిపోను నేను” సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రానికి దినేష్ కృష్ణన్ బి, జితిన్ స్టానిస్లాస్ సినిమాటోగ్రఫీ అందించగా, స్క్రీన్‌ప్లేను గణేష్ శివ రాసహ్రు. డైలాగ్స్ రకేందు మౌళి వినోత్ రాజ్‌కుమార్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ఆర్. సిబి మారప్పన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
తారాగణం: సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు, మీటా రఘునాథ్, చైత్ర
సాంకేతిక సిబ్బంది:
రచన దర్శకత్వం: శ్రీ గణేష్
నిర్మాత: అరుణ్ విశ్వ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్
సంగీతం: అమృత్ రామ్‌నాథ్
ఎడిటర్: గణేష్ శివ
డైలాగ్స్: రాకేందు మౌళి
ఆర్ట్ డైరెక్టర్: వినోద్ రాజ్ కుమార్ ఎన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.సిబి మారప్పన్
పీఆర్వో: వంశీ-శేఖర్
సిద్ధార్థ్ ‘3 BHK’ నుంచి సెకండ్ సింగిల్ ‘ఆగిపోను నేను’ విడుదల
