ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదంటోంది శృతిహాసన్‌!?

Shruti Haasan says there is no such idea at the moment!?
Spread the love

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ కూతురిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా.. స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది శ్రుతీహాసన్‌. అంతే కాదు సంగీత దర్శకురాలిగా.. గాయనిగా రాణిస్తూ, మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌ అనిపించుకుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి తరచూ అభిమానులతో టచ్ లో ఉంటారు. తాజాగా శ్రుతీహాసన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమె రాజకీయ రంగం ప్రవేశంపై ఆసక్తికరంగా ఉందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే! తాజాగా మరోసారి ఇదే ప్రశ్న శ్రుతీకి ఎదురైంది. కోయంబత్తూర్‌లో ఓ వేదికపై మీడియాతో మాట్లాడుతుండగా ఓ విలేకరి రాజకీయాలపై ఆసక్తి గురించి ప్రస్తావించారు. దీనికి శ్రుతీ సమాధానమిచ్చారు. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదని చెప్పారు. సినిమా, నటన ఇవే తనకు ఆసక్తికర విషయాలని చెప్పారు. ప్రస్తుతం శ్రుతీహాసన్‌ తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌ సరసన నటించిన ‘సలార్‌’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అంతే కాదు ‘ది ఐ’ అనే హాలీవుడ్‌ చిత్రంలోనూ అవకాశం అందుకొంది శ్రుతి. దీని గురించి ఆమె మాట్లాడుతూ ‘’భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. అయితే నాకు చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేదు. మంచి కథను ప్రేక్షకులకు అందించాలి. నటిగా అదే నా లక్ష్యం. తాజాగా నేను చేసిన మ్యూజిక్‌ ఆల్బమ్‌ను త్వరలో విడుదల చేస్తాను’’ అని శ్రుతీహాసన చెప్పారు.

Related posts

Leave a Comment