Skip to content
Wednesday, October 7, 2026
  • facebook
  • instagram
  • linkedin
  • twitter
  • Home
  • FILM NEWS
  • Entertainment
  • INTERVIEWS
  • MOVIE REVIEWS
  • Politics
  • Gossips
  • Gallery
  • VIDEOS
  • YOUTUBE
  • E Paper

‘కర్మ స్థలం’ వంటి అద్భుతమైన చిత్రంలో నటించడంతో సంతృప్తి కలిగింది.. ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

Posted on Feb 3, 2025
Being part of a film like Karmasthalam has been an immensely satisfying experience: Archana at the first look launch event
Being part of a film like Karmasthalam has been an immensely satisfying experience: Archana at the first look launch event
Spread the love
     

రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. ఈ సినిమాలో అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో కనిపించిన పాత్రలు, ఆ పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇక అర్చనా లుక్, గెటప్ ఈ పోస్టర్‌లో హైలెట్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్‌లో అమ్మవారి షాడో కనిపించడం చూస్తుంటే.. ఈ చిత్రానికి ఏ రేంజ్‌లో వీఎఫ్ఎక్స్‌ను వాడారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన అనంతరం..
హీరోయిన్ అర్చన మాట్లాడుతూ.. ‘మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇంత మంచి సబ్జెక్ట్‌ని, కర్మ స్థలం వంటి అద్భుతమైన టైటిల్‌తో సినిమాను తెరకెక్కించిన రాకీ గారికి థాంక్స్. కథను చెప్పేందుకు వచ్చినప్పుడు రాకీని చూసి కొత్త వాడు కదా.. ఎలా తీస్తారో అని అనుకున్నాను. కానీ కథను అద్భుతంగా నెరేట్ చేశారు. కథను చాలా మంది అద్భుతంగా చెబుతారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో తడబడుతుంటారు. కానీ నిర్మాత శ్రీనివాస్ గారి సహకారంతో దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ మూవీ పాన్ ఇండియ స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమిది. ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. ఆ రోజు జరిగిన షూటింగ్ నాకు ఇంకా గుర్తుంది. ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయి. పోస్టర్ ఎంత ప్రభావం చూపిస్తోందో.. సినిమా కూడా అంతే ప్రభావం చూపించబోతోంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు రాకీ షెర్మన్ మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం’ సినిమాకి మేం అంతా ప్రాణం పెట్టి, ఎంతో ఇష్టంతో పని చేశాం. వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. నిర్మాత శ్రీనివాస్ గారు నా వెన్నంటి ఉండి నడిపించారు. అర్చన గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆమె అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఎం.ఎల్ రాజా మంచి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత శ్రీనివాస్ సుబ్రహ్మణ్య మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం’ సినిమాను ఎంతో కష్టపడి చేశాం. మా దర్శకుడు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో అందరినీ ఆకట్టుకునేలా చేశారు. అర్చన గారు అద్భుతంగా నటించారు. మా సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సంగీత దర్శకుడు ఎం.ఎల్. రాజా మాట్లాడుతూ.. ‘నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. పాటలు చాలా బాగా వచ్చాయి. మున్ముందు అవి రిలీజ్ కాబోతున్నాయి. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
దిల్ రమేష్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ఇంత వరకు కర్మస్థలం వంటి అద్భుతమైన టైటిల్‌ కనిపించలేదు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంద’ని అన్నారు.
బలగం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘కర్మస్థలం’ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. కథ ఎంత బాగా చెప్పారో.. అంతే అద్భుతంగా తీశారు. అర్చన గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

Post navigation

Previous: Being part of a film like Karmasthalam has been an immensely satisfying experience: Archana at the first look launch event
Next: లావ‌ణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ ప్రారంభం..

Related Posts

'Patang' is beautiful. A must-see film: Producer SKN
  • FILM NEWS

‘పతంగ్‌’బ్యూటిఫుల్‌గా ఉంది. తప్పకుండా చూడాల్సిన సినిమా: ప్రొడ్యూసర్‌ ఎస్‌కేఎన్‌

  • M.D ABDUL
  • Dec 27, 2025
  • 0
Spread the love
     

Spread the love     ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందిన చిత్రం ‘పతంగ్‌’ […]

producer dilrraju interview pressmeet about balagam moviie
  • Entertainment
  • FILM NEWS

తెలుగు చిత్రపరిశ్రమలో ‘బ‌ల‌గం’ ఓ చ‌రిత్ర‌.. మా బాధ్యతను మరింత పెంచింది : నిర్మాత దిల్ రాజు

  • M.D ABDUL - Tollywoodtimes
  • Apr 5, 2023
  • 0
Spread the love
     

Spread the love     దిల్ రాజు సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై […]

Athreyapuram Brothers Movie Launched Grandly, Intriguing Concept Poster Unveiled
  • FILM NEWS

Athreyapuram Brothers Movie Launched Grandly, Intriguing Concept Poster Unveiled

  • M.D ABDUL
  • Jan 21, 2026
  • 0
Spread the love
     

Spread the love      Times have changed, and so have trends. […]

Live Update

View All
We won't tolerate the suppression of small films: ‘O Andala Rakshasi’ actor Shiraj Mehdi expresses anger.
  • FILM NEWS

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం

  • M.D ABDUL
  • Sep 28, 2026
  • 0

▪️ సినీ ఇండస్ట్రీలో మాఫియా రాజ్యమేలుతోంది ▪️ అడుగడుగునా మోసం, ద‌గా ఉంది ▪️ ఎలాగైనా సినిమాను త్వరలో రీరిలీజ్…

I feel lucky to be acting in 'Tatvam': Heroine Dashvika
  • INTERVIEWS

‘తత్వం’లో నటించడం లక్కీగా ఫీలవుతున్నా : హీరోయిన్‌ దష్విక

  • M.D ABDUL
  • Sep 28, 2026
  • 0

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

‘Narayanamma’ song from the movie ‘Adarsha Kutumbam’ released.
  • FILM NEWS

‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నుంచి ‘నారాయణమ్మ’ పాట విడుదల

  • M.D ABDUL
  • Sep 28, 2026
  • 0

  'ఆదర్శ కుటుంబం' మామూలు కుటుంబం కాదు.. వేరే లెవెల్ లో ఉంటుంది: ‘నారాయణమ్మ’ గీతావిష్కరణ వేడుకలో విక్టరీ వెంకటేష్…

‘NARAYANAMMA’ SONG FROM ‘AADARSHA KUTUMBAM – AK47’ RELEASED
  • FILM NEWS

‘NARAYANAMMA’ SONG FROM ‘AADARSHA KUTUMBAM – AK47’ RELEASED

  • M.D ABDUL
  • Sep 28, 2026
  • 0

“‘Aadarsha Kutumbam’ is not an ordinary family… it is on a whole different level,” says…

Karthik Jayanthi and Radhika Jayanthi's RaysuN Productions film "Rayavalasa" is set for a grand release on November 20.
  • FILM NEWS

కార్తిక్ జయంతి, రాధిక జయంతి, RaysuN ప్రొడక్షన్స్ “రాయవలస” నవంబర్ 20న గ్రాండ్ గా రిలీజ్

  • M.D ABDUL
  • Sep 28, 2026
  • 0

కార్తిక్ జయంతి హీరోగా పరిచయమౌతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “రాయవలస”. రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్నారు. RaysuN ప్రొడక్షన్స్ పై గోపీ…

Hero Akash Jagannadh Graces the Grand Trailer Launch Event of Chakkora – Lunar Love Bird
  • FILM NEWS

హీరో ఆకాష్ జగన్నాథ్ అతిథిగా ఘనంగా “చకోర – Lunar Love Bird” సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్

  • M.D ABDUL
  • Sep 27, 2026
  • 0

అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న "చకోర – Lunar Love Bird" మూవీ High Joy Commercials…

Copyright © 2024 Tollywoodtimes.in Powered by LikhiMedia Theme: National News By Adore Themes.