Rudranethri Telugu Movie Review : రుద్రనేత్రి సినిమా రివ్యూ..

Rudranethri Telugu Movie Review
Spread the love

మూవీ : రుద్రనేత్రి
నటీనటులు: మేఘన చౌదరి, పోసాని కృష్ణ మురళి, జయవాణి, జాబర్దస్త్ అప్పారావు, కుమార్ వర్మ, వృశాలి, ఆరోహి గోసవి, శ్యాం, లింగ గుగులోతు
నిర్మాత: లింగ గుగులోతు (ఈశ్వర్)
దర్శకత్వం: తిరుపతి కె వర్మ
సంగీతం: జయంత్
సినిమాటోగ్రఫి: వి.వి.ఎస్ చారి (వి.విద్య సాగర్)
ఎడిటర్: వినయ్ రామ్
విడుదల తేది: అక్టోబర్ 14, 2022.

కథ:
సూర్య(కుమార్ వర్మ) అనాథ మరియు ఒక వృద్ధ మహిళ వద్ద పెరుగుతాడు. కానీ అతను తన అనుచరులతో కలిసి ప్రయాణికులను దోచుకుంటూ అమ్మాయిలను రేప్ చేస్తుంటాడు. బాధితుల్లో మధు (వ్రుశాలి) మరియు శ్రీమతి గంగ (ఆరోహి) వుంటారు. రుద్రనేత్రి వేషధారణలో ఉన్న గంగ, మధుతో కలిసి సూర్యతో సహా రేపిస్టులు మరియు హంతకులందరినీ చంపుతుంది.
విశ్లేషణ :
సినిమాలో ఏడు పాటలు పెట్టి దర్శకుడు మంచి పని చేశాడు అనిపిస్తుంది. మూస కథ అనిపించేలోపే ఒక పాట వస్తుంటుంది. ముగ్గురు హీరోయిన్స్ గ్లామర్ ని దర్శకుడు బాగా వాడుకున్నాడు. పోసాని కృష్ణ మురళి, జయవానిలు పర్వాలేదు అనిపించారు. క్లైమాక్స్ లో ఆరోహి, వ్రుశాలి, కుమార్ వర్మ నటన బాగుంటుంది. శ్యాం లవర్ బాయ్ గా మెప్పిస్తాడు. సంగీతం దర్శకుడి పనితనం బాగుంది.
ప్లస్ పాయింట్స్: పాటలు, హీరోయిన్స్ గ్లామర్
మైనస్ పాయింట్స్: కథనం
చివరగా : వినోదాత్మకంగా సాగుతూ మెసేజ్ ఇచ్చే సినిమా
రేటింగ్ :3/5

Related posts

Leave a Comment