RRR Trailer Reviews : దద్దరిల్లిన త్రిబుల్ ఆర్ ట్రైలర్ : మైండ్ బ్లోయింగే !

RRR Traler Reviews
Spread the love

హలో ఫ్రెండ్స్.. మనమంతా ముందునుండి ఊహించిందే.. త్రిబుల్ ఆర్ రూపంలో థియేట‌ర్లలో ప్రళయం రాబోతోందని. మనం ఊహించినదానికంటే పదిరెట్లు గొప్పగా.. ఒళ్లు గగుర్పొడిచేలా త్రిబుల్ ఆర్ ట్రైలర్ ని విడుదల చేసి వాహ్.. అనిపించారు దర్శకదిగ్గజం ఎస్.ఎస్ రాజ‌మౌళి.
క‌ణ క‌ణ మండే కారు చిచ్చు.. ఉవ్వెత్తున ఎగిసే సునామి క‌లిస్తే ప్ర‌ళ‌యమే. అదే ప్ర‌ళ‌యం త్రిబుల్ ఆర్ రూపంలో థియేట‌ర్లో విరుచుకుప‌డ‌నుంది.
1920 భార‌త్ లో ఇద్ద‌రు యుగపురుషుల కాల్ప‌నిక క‌ల‌యికే ఈ సినిమా..
బ్రిటీష్ సామ్రాజ్యం ఏరియ‌ల్ షాట్ నుంచి ట్రైల‌ర్ ఓపెన్ అవుతుంది.
”స్కాట్ దొర‌వారు మా అదిలాబాద్ వ‌చ్చిన‌ప్పుడు ఓ చిన్న‌ పిల్లను తీసుకొచ్చారు. ఆమే గోండు పిల్ల‌” అని రాజీవ్ క‌న‌కాల‌ అంటారు..
గోండులు పోడు వ్య‌వ‌సాయం చేస్తారు.. దానికి బ్రిటీష‌ర్స్ కుపన్ను క‌ట్టాలి..పన్ను విష‌యంలో ఆల‌స్యమైతే బ్రిటీష్ వాళ్లు ఇలాంటి అఘాయిత్యాలు చేసి, భ‌య‌పెట్టి, బెదిరించి ప‌న్నులు వ‌సూలు చేస్తారు. దానిలో భాగంగా ఆ గోండు పిల్ల‌ను తీసుకొచ్చి ఉంటారు. ఇదే ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ కూడా అయి ఉండొచ్చు. ఆ కాప‌రే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్..
ఈ షాట్ లో గ‌మ‌నిస్తే పులి ముందు ప‌రుగెడుతున్న ఎన్టీఆర్ ముందుగానే అక్క‌డ పులిని ప‌ట్ట‌డానికి ఒక వ‌ల క‌ట్టాడు. సో.. అది బంధీ అవుతుంది. ఇక భీమ్ దాన్ని మ‌చ్చిక చేసుకుంటాడేమో చూడాలి!
అలా ప‌న్నులు క‌ట్ట‌కుండా తిప్ప‌లు పెడుతున్న గోండు జ‌నాల‌కి ధైర్యం కొమ‌రం భీమ్.. ఎన్టీఆర్ పులి అని ఇక్కడ సింబాలిక్ గా చూపించారు..
త‌రువాత వ‌చ్చే డైలాగ్..
”పులిని ప‌ట్టుకోవాలంటే వేట‌గాడు కావాలి.. ఆ ప‌ని చేయ‌గలిగేది ఒక్క‌డే సార్..” అని ఎన్టీఆర్ ని పట్టుకోవడానికి రామ్ చ‌రణ్ అలియాస్ సీతారామ‌రాజుని రంగంలోకి దింపుతారు.
బ్రిటిష‌ర్ కింద ప‌నిచేసే సీతారామ‌రాజు.. గోండులను ఎదిరించి ప‌న్నులు వ‌సూల్ చేస్తాడు.. ఆ క్ర‌మంలో భీమ్ తో స్నేహం కుదురుతుంది. ఒక నిప్పు.. ఒక సునామిల స్నేహం థియేట‌ర్లో ప్రేక్షకులకు అదిరిపోయే ఆనందం ఖాయం.
”ప్రాణం క‌న్నా విలువైన నీ సోప‌తి నా సొంతం అన్నా.. గ‌ర్వంతో గీ మ‌న్నులో క‌లిసిపోతనే..” అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ గుండెని పిండేసేలా ఉంది..
ఇక త్రిబుల్ ఆర్ టీమ్ మొద‌టి నుంచి ఇచ్చిన స్టేట్ మెంట్ నిప్పు.. నీరు అని ఆ విజువ‌ల్స్ కూడా చాలా చోట్ల సింబాలిక్ గా చూపెట్టారు. అవి బ్రిడ్జ్ కూల్చిన త‌రువాత నీటిలో ఫైర్, వ‌ర్షంలో మంట! .

ఇక గోండుల రాజు అయిన అజ‌య్ దేవ‌గ‌న్ షాట్స్ స‌రేస‌రి. మ‌నమంతా ముందు నుంచి ఊహించిన‌ట్టుగానే ఉరికంభం షాట్ అజ‌య్ దేవ‌గ‌న్ కోస‌మే అయివుంటుంద‌నేది ఇప్ప‌ట‌కీ ఊహ మాత్రమే.
సీతారామ‌రాజు బ్రిటిష‌ర్స్ కి ఎదురు తిర‌గ‌డం మొద‌ల‌వుతుంది.
ఇద్ద‌రు క‌లిసి చేసే ర‌ణం ట్రైల‌ర్ లాస్ట్ వ‌న్ మినెట్ లో ఒక్కో షాట్ ఒక్కో అస్త్రం..
ఇక రామ్ చ‌రణ్ పూర్తి అల్లూరి సీతారామ‌రాజుగా ట్రాన్స్ ఫామ్ అయే షాట్.. ఆ బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ మాములుగా లేవు. ఇక చరణ్ అప్పీయరెన్స్ కి థియేట‌ర్లు దద్దరిల్లడం ఖాయం.
ఎన్టీఆర్ కూడా అదే ఫైట్ లో బులెట్ బండిని కాలితో త‌న్ని గాల్లో లేపి.. అబ్బో మైండ్ బ్లోయింగ్.. బ‌హుషా ఇదే లాష్ట్ ఫైట్ అయింట‌ది. దాన్ని బ‌ల‌ప‌రుస్తూ.. ”న‌క్క‌ల వేట ఎంత సేపు కుంభ‌స్థలాన్ని బద్ద‌లు కోడదాం ప‌దా…” అంటూ రామ్ చ‌ర‌ణ్ చెప్పే డైలాగ్ ను బ‌ట్టి చూస్తే.. అర్థం అవుతుంది. ఇక లాస్ట్ షాట్ ఇద్ద‌రు క‌లిసి నిఘా కోట‌లోని పోలీసుని త‌న్నే సీన్.. మైండ్ బ్లోయింగే !

Related posts

Leave a Comment