Bhoothaddam Bhaskar Narayana Review : భూతద్ధం భాస్కర్ నారాయణ రివ్యూ: .. ఎంగేజింగ్ థ్రిల్లర్!

Review: Bhaskar Narayana's Bhoothadham.. Engaging Thriller!
Spread the love

‘చూసి చూడంగానే’ ‘గమనం’ ‘మనుచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు శివ కందుకూరి. అతని నుండి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సినిమా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. విడుదలకు ముందు ఇదొక మైథాలజీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ అని టీజర్, ట్రైలర్స్ తో పాటు ఓ శివుడి పాటతో కూడా హింట్ ఇచ్చారు. అలాగే జనాల్లోకి వెళ్లి ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకుడు. నేడు (మార్చి 1,2024) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి ఉదాహరణ. అయితే తెలుగులో మంచి డిటెక్టివ్ థ్రిల్లర్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు శివ కందుకూరి నటించిన ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ప్రమోషనల్ కంటెంట్ ఈ జోనర్ ప్రేక్షకులని ఊరించింది. డిటెక్టివ్ కథకు పురాణాలతో ముడిపెట్టడం ఆసక్తిని పెంచింది. మరి ఆ ఆసక్తి సినిమాలో కనిపించిందా? ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ టేకాప్ చేసిన కేసులోని మలుపులు ప్రేక్షకులని అలరించాయా.. తెలుసుకుందాం…

కథ విషయానికి వస్తే.. కథ మొత్తం తెలుగు, కన్నడ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతుంది. ఎవరో ఒక సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తూ వస్తుంటాడు.ఈ వరుస హత్యలు కలకలం రేపుతాయి. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలుగా పిలుస్తారు పోలీసులు. ఎవరో సైకో కిల్లర్ మహిళల తల నరికేసి ఆ స్థానంలో దిష్టిబొమ్మని పెడతాడు ఇక ఈ కేసుని సాల్వ్ చేయడానికి డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. అలా కేసులోకి అడుగుపెట్టిన డిటెక్టీవ్‌కి.. ఆ హత్యలకు, దిష్టిబొమ్మ పురాణానికి ఉన్న కనెక్షన్ తెలుసుకుంటాడు. ఇక ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు..? తల నరికేసి దిష్టిబొమ్మని ఎందుకు పెడుతున్నాడు..? సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ మరి ఈ కేసుని చేధించాడా? ఈ కేసుకిపురాణాలకి మధ్య వున్న లింక్ ఏమిటి ? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి.? అనేది థియేటర్ లోనే చూడాలి.

విశ్లేషణ: సినిమా కాన్సెప్ట్ బాగుంది. డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడు మంచి ఆసక్తి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ తో వచ్చిన ప్రతి సినిమా దాదాపు మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే తరహాలో చాలా కాలం తరువాత టాలీవుడ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన డిటెక్టివ్ సినిమా ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. దిష్టిబొమ్మ పురాణాన్ని డిటెక్టివ్ కథకి జత చేసి సినిమా తెరకెక్కించడంతో మూవీ పై ఆడియన్స్ లో మంచి ఆసక్తిని కలుగజేసింది. డిటెక్టివ్ థ్రిల్లర్స్ అంటే ఆడియన్స్ లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడంలో ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ సక్సెస్ అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురాణా కథకి క్రైమ్ థ్రిల్లర్‌కి కనెక్షన్ పెట్టడం.. ఆడియన్స్ కి కొత్త ఫీలింగ్ ని కలిగిస్తుంది. చివరి వరకు సస్పెన్ ని మెయిన్‌టైన్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే మలుపులు ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ దగ్గర కూర్చునేలా చేస్తుంది. సీరియల్ కిల్లర్ ఎవరు అనే విషయాన్ని చివరి వరకు సస్పెన్స్ గా ఉంచి ఆడియన్స్ ని బాగానే థ్రిల్ చేస్తాయి. ఇక ఈ థ్రిల్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ అండ్ లవ్ ఎమోషన్స్ కూడా బాగానే ఆకట్టుకుంటాయి. హీరో పాత్ర డిటెక్టివ్ అని ఏదో సింపుల్ గా చెప్పేయకుండా.. అతని కథని చిన్నప్పటి నుంచి చెప్పుకు రావడం ఆ పాత్రకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ ని చాలా చక్కగా తీర్చిదిద్దుకున్న దర్శకుడు.. ఫస్ట్ హాఫ్ ని మాత్రం కొంచెం ల్యాగ్ చేసాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగినా యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉండడం వల్ల ఓకే అనిపిస్తుంది. తలలు లేకుండా స్త్రీల డెడ్ బాడీస్ ను చూపించే విజువల్స్ ను నేచురల్ గా, భయపెట్టే విధంగా చిత్రీకరించారు. ఆయా సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ ప్రేక్షకులను ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం డివోషనల్ ఫీల్ తో పాటు హార్రర్ ఫీల్ కూడా కలిగించింది. ఒకసారి చూసే డీసెంట్ థ్రిల్లర్ సినిమా ఇది. థ్రిల్లర్ కథలకు వుండాల్సిన ప్రధాన లక్షణం సస్పెన్ ని చివరి వరకూ ఆసక్తిగా కొనసాగించడం. ఈ విషయంలో ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’కు మంచి మార్కులు పడతాయి. ఒక క్రైమ్ థ్రిల్లర్ కి పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం భలే కుదిరింది. నిజానికి ఇలాంటి కంటెంట్ తెలుగులో సినిమాలు రాలేదనే చెప్పాలి. హీరో చైల్డ్ వుడ్ ఎపిసోడ్ తో మొదలు పెట్టిన దర్శకుడు ఆ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాడు. ఫన్ ఎలిమెంట్స్ తో పాటు లవ్ ఎమోషన్ ఫర్వాలేదనిపిస్తాయి. అయితే సీరియల్ కిల్లింగ్స్ తెరపైకి వచ్చిన తర్వాత కథ చాలా ఉత్కంఠగా ముందుకు సాగుతుంది. సీరియల్ కిల్లర్ ఎవరు ?అనే ఆసక్తి చివరి వరకూ కొనసాగుతుంది. ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు ప్రేక్షకులని మరితంగా అలరిస్తాయి. దర్శకుడు రాసుకున్న పురాణ కోణం బాగా వర్క్ అవుట్ అయ్యింది. అది కథకు ఒక కొత్తదనం తెచ్చింది. చివరివరకూ సస్పెన్స్ ని హోల్డ్ చేయడంలోనే దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

నటీనటులు: శివ కందుకూరి, భాస్కర్ నారాయణ పాత్రలో ఒదిగిపోయాడు. డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో చూపిస్తుంటారు, ఇందులో మాత్రం ఆ పాత్రకు లోకల్ టచ్ ఇవ్వడం నేచురల్ గా వుంది. ఆ పాత్రతో మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. తన పెర్ఫామెన్స్ చాలా ప్రామెసింగ్ గా వుంది. యాక్టింగ్ లో మంచి యీజ్ చూపించాడు. డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. డిటెక్టివ్ గా తన బాడీ లాంగ్వేజ్.. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చూసిన దానికి డిఫరెంట్ గా ఉంది. భాస్కర్ నారాయణ పాత్రలో శివ కందుకూరి జీవించేసాడు అనే చెప్పాలి. ఈస్ అఫ్ యాక్టింగ్ తో డిటెక్టివ్ గా ఆడియన్స్ ని మెప్పిస్తాడు. అన్ని సినిమాల్లో చూపించినట్లు డిటెక్టివ్ ని బ్లాక్ అండ్ బ్లాక్ లో కాకుండా ఆ ప్రాంతానికి తగ్గట్టు లోకల్ టచ్ ఇవ్వడం అనేది నేచురల్ గా కనిపిస్తుంది. ఇక రిపోర్టర్ లక్ష్మీగా కనిపించిన రాశి సింగ్ తన పాత్రకి న్యాయం చేశారు. రాశి సింగ్ నటన బావుంది. మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆయా నటులు కథకు బాగా హెల్ప్ అయ్యారు.

టెక్నికల్ గా శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం ఈ సినిమాకి బిగ్ ఎసెట్. ఆయన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లోని పలు థ్రిల్లర్ సినిమాలకు శ్రీచరణ్ స్కోర్ ఎలా అసెట్ అయ్యిందో.. ఈ చిత్రానికి కూడా అంతే పెద్ద అసెట్ గా నిలిచింది. థ్రిల్లింగ్ మూడ్ ని బాగా ఎలివేట్ చేశాడు. తన సంగీతంలో కూడా ఒక రూరల్ టచ్ కనిపించింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా అనిపిస్తుంది. దర్శకుడు అయితే కొత్తదనం ఉన్న కంటెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. థ్రిల్లర్స్ ని ఇష్టపడే ఆడియన్స్ కి ఈ భూతద్ధం భాస్కర్ నారాయణ బాగా నచ్చేస్తాడు. ఈ సినిమా కోసం నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై కనిపించింది. విఎఫ్ఎక్స్ అవుట్ పుట్ బాగానే వుంది. దర్శకుడు చెప్పిన కంటెంట్ లో కొత్తదనం వుంది. థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులు ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ నచ్చుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్: 3 /5

Related posts

Leave a Comment