Ram Charan – Rashmika : రామ్ చరణ్‌ సెన్సేషనల్ ప్రాజెక్టులో రష్మిక మందన్న!!

Ramcharan-Rashmika manddanna
Spread the love

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక్కో సీజన్‌లో ఒక్కో హీరోయిన్ హవా నడుస్తుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్..తర్వాత పూజాహెగ్డే.. ఇప్పుడు రష్మిక మందన్న. ఇలా ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ వరస అవకాశాలు అందుకుంటూ క్రేజీ స్టార్ల లిస్టులో చోటు సంపాదిస్తుంటారు. ప్రస్తుతం ఈ హీరోని కదిపినా ఇప్పుడు రష్మిక మందన్న పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా ఒక్కరితో నటించిందంటే చాలు.. వరసగా అంతా అవకాశాలు ఇస్తుంటారు. ఇప్పుడు రష్మిక విషయంలో కూడా ఇదే జరుగుతోంది. తొలిసారి రెండేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రష్మిక చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ కావడంతో.. వరసగా ఆమెకు స్టార్స్ పిలిచి మరీ ఛాన్సులిస్తున్నారు. ఈ రెండేళ్లలో రష్మిక కెరీర్ గ్రాఫ్ కూడా ఊపందుకుంది. ఊహించనంతగా బాగా పెరిగిపోయింది.తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ వరస సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. తాజాగా ఆమె ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కు జోడీగా నటించిన ‘పుష్ప’ సినిమాతో ఈ బ్యూటీకి నేషనల్ వైడ్‌గా ఎంతో పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్‌తోనే మరిన్ని హిందీ సినిమాలు కూడా ఆమె ఖాతాలో పడిపోయేలా కనిపిస్తున్నాయి.అయితే..తాజాగా ఇప్పుడు మరో సెన్సేషనల్ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరు పరిశీలిస్తున్నారట దర్శక నిర్మాతలు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రంలోనూ ఈమెకు కథానాయికగా అవకాశం వచ్చిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’, ‘ఆచార్య’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవి విడుదలైన తర్వాత మరో రెండు సినిమాలు కూడా లైన్‌లో పెట్టాడు. శంకర్ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమా సెట్స్‌పైనే ఉంది. ఏపీలో షూటింగ్ కోసం పర్మిషన్స్ కూడా తీసుకున్నారుట. అక్కడే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శంకర్. ఇందులో రామ్ చరణ్ కలెక్టర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వాని హీరోయిన్. ‘వినయ విధేయ రామ’ తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు చరణ్, కియారా. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 250 కోట్లతో దిల్ రాజు ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో యూవీ క్రియేషన్స్‌లో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు చరణ్. జెర్సీ తరహాలోనే ఇది కూడా స్పోర్ట్స్ నేపథ్యంలోనే రాబోతుందని సమాచారం. పైగా రామ్ చరణ్‌కు కూడా స్పోర్ట్స్ సినిమాలు అంటే చాలా యిష్టం. అందుకే గౌతమ్ అలాంటి కథతోనే వచ్చాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి శంకర్ సినిమాలో 20 నిమిషాల నిడివి ఉన్న పాత్ర కోసం రష్మికను అడిగితే.. ఏకంగా కోటి పారితోషికం అడిగిందని.. దాంతో ఈమె స్థానంలో మరొకర్ని తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు గౌతమ్ సినిమాలో మాత్రం మెయిన్ హీరోయిన్‌గానే ఈమెను ఎంచుకుంటున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తారేమో చూడాలి!!

Related posts

Leave a Comment