నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కించిన ‘కమిటీ కుర్రోళ్లు’తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇక ప్రస్తుతం నిహారిక జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్ ప్రారంభించింది. ఇప్పటి వరకు ‘రపప్పా’, ‘పదే పదే’ పాటల్ని మేకర్లు రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ‘స్నేక్ డ్యాన్స్’ అనే పాటను విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే ఇదొక ప్రమోషనల్ గీతంగా కనిపిస్తోంది. గ్యాంగ్ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఈ పాటను కంపోజ్ చేశారు. ‘స్నేక్ డ్యాన్స్’ పాటలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, సంగీత్ శోభన్, నయన్ సారిక తమ స్టైల్లో దుమ్ములేపేశారు. ఇక చివర్లో మెగా ప్రొడ్యూసర్ నిహారిక వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఈ పాటకు అనుదీప్ క్యాచీ ట్యూన్‌ను ఇచ్చారు. రఘురాం సాహిత్యం ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. బెన్నీ దయాల్, మనీషా పాండ్రంకి, రితేష్ జి రావు, లక్ష్మీ మేఘన, వినాయక్ గాత్రం ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. రాజు ఎదురోలు ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా పని చేశారు. ఏప్రిల్ 3న ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
‘రాకాస’ స్నేక్ డ్యాన్స్..
