Radhe Shyam Release : ‘రాధేశ్యామ్’ ఓటీటీ ప్లాట్​ఫామ్​లో రానుందా?

Radhe-Shyam
Spread the love

వినోదరంగాన్ని తనవైపునకు మరల్చుకున్న ఓటీటీ చిన్న సినిమాలనే కాదు.. పెద్ద సినిమాలు.. పాన్​ ఇండియా అనబడే చిత్రాలను సైతం లాగేసుకుంటోంది! ఇప్పుడు ఎవ్వరినోటా విన్నా ఓటీటీ మాటే! తాజాగా ఈ ఓటీటీలో నేరుగా ‘రాధేశ్యామ్’​ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్త తెగ చక్కర్లు కొడుతోంది. పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ చిత్రం కోసం అభిమానులే కాదు..సినిమాను అభిమానించే సినీజీవులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇదిగో.. అప్పడు..ఇప్పుడు అంటూ జనవరిలో విడుదలవుతుందనుకున్న ‘రాధేశ్యామ్’​కు అనేకసార్లు బ్రేక్​ పడింది. దీంతో ప్రేక్షకుల్లో, ప్రభాస్​ హార్ట్​కోర్​ ఫ్యాన్స్​లో తీవ్ర నిరాశ నెలకొంది. అయితే ఈ లవ్​స్టోరీ అనబడే ‘రాధేశ్యామ్’ ని థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తప్పకుండా అందులోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూడా ఇదివరకే చాలా సార్లు..వార్తలు గుప్పుమన్నాయి. ఇలాంటి వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ‘రాధేశ్యామ్’ మేకర్స్ ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండిస్తూనే వచ్చారు. ఎట్టి పరిస్థితులోనూ థియేటర్లలోనే విడుదల చేస్తామని చెప్పుకొచ్చింది. అయితే.. తాజాగా మరోసారి ‘రాధేశ్యామ్’​ విడుదల విషయంపై మళ్లీ వార్తలు జోరుజోరుగా ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారని సమాచారం. ఇందుకు సంబంధించి అన్ని ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలైన జీ5, నెట్​ఫ్లిక్స్​ ఈ ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని దక్కించుకునేందుకు భారీ ఆఫర్స్ ఇచ్చాయని అంటున్నారు. ఈ ఆఫర్స్ కు ‘రాధేశ్యామ్’ మేకర్స్ కూడా సంతృప్తి పడ్డట్టు సమాచారం.

Related posts

Leave a Comment