బి.కె.ఎస్ దర్శకత్వంలో బి గణేష్, బద్దెల శ్రీనివాస్, నవ్యశ్రీ తదితరులు ప్రధానపాత్రల్లో శ్రీ లక్ష్మీ హనుమ శివపార్వతి బ్యానర్ పై హరి ఓం తపశ్రిత సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమతో దెయ్యం’. చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదలయింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందిందని దర్సకుడు బి.కె.ఎస్ తెలిపారు. నిర్మాత బి. కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాను నిర్మించామన్నారు. సినిమాలో ప్రతీ ఒక్కరినీ కదిలించే సన్నివేశాలు ఉంటాయన్నారు. ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపినట్టు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రసన్నకుమార్ , అనుపమారెడ్డి టీజర్ ని విడుదల చేయగా, సముద్ర, శివనాగు సాంగ్స్ , తుమ్మలపల్లి సత్యనారాయణ ట్రైలర్ ని విడుదల చేశారని చెప్పారు. విజయచిత్ర ఎడిటర్ గుర్రపు విజకుమార్ మాట్లాడుతూ … సినిమా ఆద్యంతం ప్రతీ ఒక్కరినీ అలరిస్తుందని చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టునే విధంగా సినిమా ఉంటుందని అన్నారు. నిర్మాత రాజేష్ పుత్ర మాట్లాడుతూ.. ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటూనే అన్ని వర్గాలవారిని అలరిస్తుందని చెప్పారు. ఈ చిత్రలోని ఇతర పాత్రల్లో దేవి, ఉమారాణి, రామకృష్ణ, రజాక్ , మస్తాన్ అలీ, రవి, బాబు, తపశ్రిత, హరి ఓం, హరిచరణ్ నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శేఖర్ , సంగీతం : సి.హెచ్. అమ్మ పాండు, ఎడిటింగ్ : డి.ఆర్ శ్యాం కుమార్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ : సిస్సి జస్టిన్, బ్యానర్ : శ్రీ లక్ష్మీ హనుమ శివపార్వతి , సమర్పణ: హరి ఓం తపశ్రిత , నిర్మాత: బి. కుమార స్వామి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : బి.కె.ఎస్.
సినీ ప్రముఖుల సమక్షంలో ‘ప్రేమతో దెయ్యం’ ట్రైలర్ విడుదల
