‘దేశం కోసం మనలో ఒక్కడు’ ప్రారంభం

'One of Us for the Nation' begins
Spread the love

గోపీవర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మాతగా హరివర్మన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘దేశం కోసం మనలో ఒక్కడు’. నటరాజన్ అండ్ కృష్ణమాల్ సమర్పణలో టి. గోపీవర్మ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి శుభ ముహూర్తం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సత్య ప్రకాశ్ హాజరై క్లాప్ కొట్టగా .. ప్రముఖ కొరియో గ్రాఫర్ గణేష్ మాస్టర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గోపీవర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర శుభ ముహూర్తం ను పూజతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ గోపీవర్మ మాట్లాడుతూ.. నా మొదటి చిత్రం ‘రాయలసీమ ప్రేమ కథ’. దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ‘దేశం కోసం మనలో ఒక్కడు’ అని తెలిపారు. నిర్మాత రాజశేఖర్ గారికి ఎంతో రుణపడి వున్నానని .. ఎందుకంటే ‘దేశం కోసం మనలో ఒక్కడు’ చిత్రానికి సంబంధించి ప్రొడ్యుసర్స్ రావడం అంటే చాలా అరుదు. కానీ నన్ను నమ్మి ప్రొడ్యూసర్ ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమిళ్ లో మొదటి సినిమా పూర్తి చేసిన హరి వర్మన్ హీరోగా తెలుగు సీమకు పరిచయం చేస్తున్నాను. అలాగే మొదటి సాంగ్ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ గారు చాలా బాగా చేశారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ చిత్రానికి సంబంధించి సెకండ్ షెడ్యుల్ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం : గోపీవర్మ , నిర్మాత : రాజశేఖర్ మదనపల్లి, డీఓపీ : వెంకీ కనకాల, ఎడిటర్ : సలీం అండ్ ఎం.ఎన్.ఆర్, సంగీతం: హర్ష ప్రవీణ్, కొరియో గ్రఫీ: గణేష్ మాస్టర్, డిజైనర్ : రాజు, మేనేజర్ : టీ ఎం ప్రకాష్.

Related posts