ప్రముఖ యువ నృత్య కళాకారిణి విశిష్ఠ డింగరి భరతనాట్య ప్రదర్శనతో నృత్యార్పణం చేయనున్నారు. ముంబయి కి చెందిన నృత్యోదయ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి లోని బ్రహ్మ కుమారీస్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో విశిష్ఠ నృత్య ప్రదర్శన జరుగుతుందని ముంబయి నుంచి విచ్చేసిన ప్రఖ్యాత భరత నాట్య గురు డా. జయశ్రీ రాజగోపాలన్ గురువారం తెలిపారు. త్రిదండి చిన శ్రీమన్నారాయణ జీయరు స్వామి, ప్రముఖ నాట్య గురువు పద్మ విభూషణ్ డా. పద్మా సుబ్రహ్మణ్యం (చెన్నై), సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, కళారత్న అశోక్ గుర్జాలే తదితరులు పాల్గొంటారు. విశిష్ఠ డింగరి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి కాలిఫోర్నియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో వైపు గత 15 ఏళ్లుగా భరతనాట్యం, కూచిపూడి నృత్యం నేర్చుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ మంచి నర్తకిగా గుర్తింపు పొందారు. నాట్య గురు డాక్టర్ జయశ్రీ రాజగోపాల్ శిష్యరికంలో భరత నాట్యంలో నృత్య విశారద పూర్తి చేసి ప్రస్తుతం నృత్త కరణాల ప్రధానమైన నృత్య శాలి కోర్సు లో ఉన్నారు. ఆమె మంచి ఆల్ రౌండర్. డా. ఉమా రామారావు దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. చెన్నై శాస్త్ర యూనివర్సిటీ నుంచి డా.పద్మా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భరతనాట్యం ఫైనార్ట్స్ పూర్తి చేశారు. హైదరాబాద్ లో బి. టెక్ పూర్తయ్యాక అమెరికా బోస్టన్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్ అండ్ అడ్వర్టైజింగ్ లో ఎం. ఎస్. చేశారు. ఆమె అంతర్జాతీయ స్విమ్మర్. అరేబియా మహా సముద్రంలో అనేక సార్లు ఈత పోటీల్లో పాల్గొని మెడల్స్ కైవసం చేసుకుని ఛాంపియన్ గా నిలిచారు. జాతీయ స్థాయి పోలో క్రీడాకారిణిగా మన్ననలందుకున్నారు. మరోవైపు కరాటేలో కొరియా నుంచి నాలుగు సార్లు బ్లాక్ బెల్ట్ సాధించి రికార్డు సృష్టించారు. భవిష్యత్ లో భారతీయ జ్ఞాన పరంపరను కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు విశిష్ఠ డింగరి తెలిపారు.
Related posts
-
WANTED TEACHERS FOR THE USA
Spread the love WANTED TEACHERS FOR THE USA -
అత్యంత వైభవంగా సౌధామినీ వివాహం
Spread the love దూడల శ్రీనివాస్ గంగాధర్ ప్రధమ పుత్రిక చి!!.ల!!సౌ!! సౌధామినీ వివాహం చి!! శివ కుమార్ (శ్రీ స్వామి గౌడ్... -
ఒంటరి మహిళల కోసం పని చేస్తున్న ఏకైక సంస్థ.. ‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్’పై ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్
Spread the love ఒంటరి మహిళలకు చేయూతనిచ్చేందుకు ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ సంస్థ పని చేస్తోంది. ఈ క్రమంలో ఈ స్వచ్చంద సంస్థ...