యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో NSUI ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ బంద్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా NSUI మండల అధ్యక్షులు సుంకరి విక్రమ్ మాట్లాడుతూ.. మొన్న విడుదలైన ఇంటర్మీడియేట్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు బలైన విద్యార్థుల న్యాయం కోసం NSUI పోరాడుతుంటే ఇంటర్మీడియేట్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసులను అడ్డం పెట్టుకోని మమ్మల్ని అడ్డుకోవడం వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడంలో భాగమేనని మండిపడ్డారు. అలాగే విద్యార్థుల ప్రాణాలకు బాధ్యులైన తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు తీరుకు నిరసనగా ఈరోజు ఆలేరులో ఉన్నటువంటి అన్ని జూనియర్ కళాశాలను NSUI ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగిందని చెప్పారు.
NSUI ఆధ్వర్యంలో ఆలేరులో ఇంటర్మీడియట్ కళాశాలలు బంద్
