అట్టహాసంగా నార్త్ ఈస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ : హాజరైన గవర్నర్, మంత్రి కోమటిరెడ్డి

North East Film Festival in full swing: Governor, Minister Komatireddy attend
Spread the love

తెలంగాణ నార్త్ ఈస్ట్ సినిమా ఉత్సవాల్లో భాగంగా నేటి సాయంత్రం ఐమాక్స్ థియేటర్ నందు ప్రాంతీయ భాష చిత్రాల దర్శకులు, నిర్మాతలు నటీనటులు తదితర డెలిగేట్స్ కు రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా మాధ్యమానికి ఎల్లలు లేవని, తెలంగాణలో అనేక చారిత్రక వారసత్వ కట్టడాలు ఉన్నాయని ప్రకృతి వైవిధ్యం ఉన్నదని సినిమా నిర్మాణాలకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు. సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. తెలుగు సినిమాలు హాలీవుడ్ తో పోటీపడి ఆస్కార్ అవార్డులు సాధించాయని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత స్టూడియోలు, నిర్మాణ వసతులు హైదరాబాదులో ఉన్నాయని తెలిపారు. సినిమా నిర్మాణానికి తెలంగాణను మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈశాన్య భారత సినిమాలు తీయుటకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ సమక్షంలో అస్సాం రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంస్థల మధ్య చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని పరస్పరం అందజేసుకున్నారు.

Related posts