దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక్క సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఈ అమ్మడు.. దాదాపు 20 ఏళ్లుగా సినిమాల్లో చక్రం తిప్పుతోంది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఈ అమ్మడు సినిమాలతోపాటు ఎప్పుడూ వివాదాల్లోనూ చిక్కుకుంటుంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న హీరోయిన్ నయనతార తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది. ఇప్పుడు నయన్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. షారుఖ్ ఖాన్ చిత్రం జవాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఆ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. అలాగే ఈ చిత్రానికి నయన్ రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తుంది. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో నయనతార ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. హీరోలకు మించి స్టార్ డమ్ సంపాదించుకుంది. ‘జవాన్’ సినిమాతోనూ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలకు మించిన పారితోషికం తీసుకుంటుంది. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయనతార చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఓ హీరో సినిమాలో నటించి తప్పు చేశానని అంటుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించింది నయన్. కానీ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. ఇటీవల ఆమె తన భర్తతో విడాకులు తీసుకుబోతుందంటూ ప్రచారం నడించింది. అయితే ఆ రూమర్స్ అన్ని అవాస్తవాలు అంటూ కొట్టిపడేసింది. అయితే తాను చేసిన సినిమాల్లో, తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత చెత్త డెసిషన్ గజినీ సినిమా చేయడమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 2005లో ఏఆర్ మురగదాస్ తెరకెక్కించిన గజినీ చిత్రంలో సూర్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆసిన్ కథానాయికగా నటించగా.. నయన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అయితే ఈ సినిమాలో తనను చెడుగా చూపించారని.. హీరోయిన్ పాత్రకు దగ్గరగా ఉందని చెప్పి.. అలా చూపించలేదని అన్నారు. అది తనను ఎంతో బాధించిందని.. ఆ సినిమా చేసి తప్పు చేశానని గతంలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నయన్ కామెంట్స్ మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు సౌత్‌లోనే ఎవరికీ లేని స్టార్ ఇమేజ్‌తో రాణిస్తోంది. అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా క్రేజ్ ని సంపాదించుకుంది. ఓవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూనే మరోవైపు కమర్షియల్ సినిమాల్లోనూ చేస్తోంది. బిగ్ స్టార్స్ తోనూ జోడీ కడుతోంది. అందులో భాగంగా ఇప్పుడు తెలుగులో రెండు చిత్రాలు చేస్తోంది. చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతికి రాబోతుంది. కొత్తగా బాలకృష్ణతో ఎన్బీకే111 సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే.
నయనతార..హీరోలకు మించిన స్టార్ డమ్!
