ట్రాన్స్‌ జెండర్‌గా నవాజుద్దీన్‌ సిద్దిఖీ!

Nawazuddin Siddiqui as transgender!
Spread the love

భజరంగీ భాయిజాన్‌, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసిపూర్‌, బద్లాపూర్‌, సాక్రేడ్‌ గేమ్స్‌ , లాంటి చిత్రాలతో విలక్షణ నటుడిగా బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌ తెచ్చుకున్నాడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ. తన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించడం, భయపెట్టించడం, ఏడిపించడం ఈ యాక్టర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇక నవాజుద్దీన్‌ సిద్దిఖీ నటిస్తున్న తాజా చిత్రం హడ్డి. ఇప్పటికే ’తాల్‌’ సినిమా ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా సుస్మితసేన్‌ అలరించగా.. నవాజుద్దీన్‌ కూడా హడ్డి చిత్రంలో అలాంటి పాత్రతో వస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫప్ట్‌ లుక్‌, టీజర్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రాన్స్‌జెండర్‌గా నవాజుద్దీన్‌ కనిపించనున్నట్లు ట్రైలర్‌ గమనిస్తే తెలుస్తుంది. అమ్మాయిగా మారాలనుకునే హరి పాత్రలో నవాజుద్దీన్‌ నటిస్తుండగా. అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అతనికి జరిగిన అన్యాయ్యానికి ఎలా పగతీర్చుకున్నాడు అనేది ట్రైలర్‌లో చూడవచ్చు. ఇక రెవెంజ్‌ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్షత్‌ అజయ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

Related posts

Leave a Comment