నవాబ్ కేఫ్ రివ్యూ : ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా!

Nawab Cafe Review: Emotional family drama!
Spread the love

నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి, ‘భూతద్ధం భాస్కర్’ వంటి హిట్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ‘నవాబ్ కేఫ్’. తేజు అశ్విని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో విశ్లేషణలో చూద్దాం…
కథ: పాతబస్తీలో రంగనాథ్ (రాజీవ్ కనకాల) తన కుటుంబ వారసత్వంగా వస్తున్న ‘నవాబ్ కేఫ్’ అనే చాయ్ హోటల్‌ను నడుపుతుంటాడు. ఆయన కుమారుడు రాజా (శివ కందుకూరి) బాధ్యత లేకుండా స్నేహితులతో తిరుగుతుంటాడు. ఈ క్రమంలో సఖి (తేజు అశ్విని)తో ప్రేమలో పడతాడు. తన పెదనాన్న కొడుకు లగ్జరీ లైఫ్ చూసి ఆకర్షితుడైన రాజా, తమకున్న కోట్ల విలువైన కేఫ్ స్థలాన్ని అమ్మేసి జూబ్లీహిల్స్‌లో సెటిల్ అవుదామని తండ్రికి చెబుతాడు. ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగి, మనస్తాపంతో రంగనాథ్ హఠాత్తుగా మరణిస్తాడు. తండ్రి మరణం తర్వాత రాజాలో వచ్చిన మార్పు ఏంటి? ఆ కేఫ్‌ను కాపాడుకున్నాడా లేదా? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ: వారసత్వంగా వచ్చే ఆస్తులు కేవలం డబ్బుతో కూడినవి కావు, అవి పెద్దల సెంటిమెంట్ మరియు గౌరవానికి చిహ్నాలు అని ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రమోద్ హర్ష చక్కగా చూపించారు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే సీన్స్, తండ్రి మరణం తర్వాత కొడుకు బాధ్యతగా మారే క్రమం హృదయానికి హత్తుకుంటుంది. శివ కందుకూరి సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. రాజీవ్ కనకాల తన అనుభవంతో పాత్రకు ప్రాణం పోశారు. హీరోయిన్ తేజు అశ్విని హోమ్లీ లుక్స్‌తో ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ.. సంగీతం పాతబస్తీ వాతావరణాన్ని, ఫ్యామిలీ మూడ్‌ని బాగా ఎలివేట్ చేశాయి.
అయితే.. ఫస్టాఫ్ కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. మొత్తం మీద
‘నవాబ్ కేఫ్’ ఎటువంటి అశ్లీలత లేని ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఈ తరం యువత తప్పక చూడాల్సిన బాధ్యతాయుతమైన చిత్రం. ఈ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా. (రేటింగ్: 375/5)</p>

Related posts