‘యానిమల్’తో ఒక్కసారిగా ఫేమ్ సొంతం చేసుకున్నారు బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి . ఈ సినిమా తర్వాత యూత్‌లో ఆమెకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఆమె నేషనల్ క్రష్‌గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. అభిమానులు తనని ‘నేషనల్ క్రష్’ అని పిలవడంపై తాజాగా త్రిప్తి స్పందించారు. ఆ ట్యాగ్ విషయంలో తాను ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టి దాదాపు ఏడేళ్లు అయ్యింది. అందుకు సంతోషంగా ఉన్నా. గొప్ప నటీనటులు, దర్శకులతో వర్క్ చేస్తానని కెరీర్ ఆరంభంలో ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే, యాక్టింగ్‌ను నేను సీరియస్‌గా తీసుకోలేదు. మొదటి సినిమా పూర్తయిన తర్వాత కెరీర్‌ను విధికే వదిలేశా. ‘ఒక సినిమా పూర్తి చేశా. అదృష్టం ఉంటే రెండో సినిమా రావొచ్చు’ అనుకున్నా. అలాంటి సమయంలో ‘లైలా మజ్ను’ కోసం ఆడిషన్‌లో పాల్గొన్నా. ఆనాటి నుంచి యాక్టింగ్‌పై దృష్టిపెట్టా. నటనలో శిక్షణ తీసుకొన్నా. ప్రేక్షకులు నా నటనతో కనెక్ట్ అవుతున్నారు. నేషనల్ క్రష్ అనేది నా దృష్టిలో ట్యాగ్ మాత్రమే కాదు. అభిమానుల ప్రేమ. వాళ్లు నన్ను అలా పిలుస్తున్నందుకు ఆనందంగా ఉన్నా. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది. ప్రేక్షకులను అలరించే చిత్రాల్లో నటించాలని తెలియజేసింది’’ అని తెలిపారు. త్రిప్తి నటించిన సరికొత్త చిత్రం ’బ్యాడ్‌న్యూస్’. ఆనంద్ తివారీ దర్శకుడు. విక్కీ కౌశల్, అవిరీ విర్క్ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. మంచి టాక్ సొంతం చేసుకుంది.
Related posts
-
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా.. చలన చిత్ర అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్ దిల్ రాజ్
Spread the love రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు బుధవారం... -
అత్యంత ఘనంగా ‘నాగన్న’ మూవీ ట్రైలర్ విడుదల
Spread the love చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కుమార్ హీరోగా, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న... -
జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్
Spread the love మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామా, క్రావెన్: ది హంటర్ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది....