(చిత్రం : ‘నారాయణ & కో’ , విడుదల తేది: జూన్ 30, 2023, రేటింగ్: 3.25/5, నటీనటులు: సుధాకర్ కోమకుల, ఆర్తిపొడి, దేవి ప్రసాద్, ఆమని, పూజ కిరణ్, సప్తగిరి తదితరులు. నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్, సుధాకర్ కోమకుల, దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి, సంగీతం: సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్)
కథ:నారాయణ(దేవి ప్రసాద్), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్(సుధాకర్ కోమకుల) క్యాబ్ డ్రైవర్. క్రికెట్లో బెట్టింగ్ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్ (జై కృష్ణ) కెమెరామెన్. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోని పంపి, రూ. 10 లక్షలు ఇవ్వకుంటే ఆది వైరల్ చేస్తానని బెదిరిస్తాడు ఓ అజ్ఞాత వ్యక్తి. మరోవైపు నారాయణ పని చేసే బ్యాంకులో రూ.25 లక్షల దొంగతనం జరుగుంది. అది నారాయణ మీదకు వస్తుంది. రూ.25 లక్షలు తిరిగి ఇవ్వకుంటే పోలీసు కేసు పెడతానని మేనేజర్ బెదిరిస్తాడు. దీంతో నారాయణ ఫ్యామిలీ అంతా డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్ చేయాలని భావిస్తారు. నారాయణ మేనకోడలు నళిని(పూజా కిరణ్)తో కలిసి కిడ్నాప్‌కి ప్లాన్ చేస్తే వర్కౌట్ కాదు. ఇదే సమయంలో వారికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రౌడీ శంకర్(తోటపల్లి మధు) తరపున ఓ డీల్ వస్తుంది. ముంబైకి వెళ్లి ఓ పిల్లి బొమ్మను తీసుకువస్తే.. రూ. కోటి ఇస్తామని ఆఫర్ ఇస్తారు. దీంతో నారాయణ ఫ్యామిలీ వెంటనే ఆ డీల్ ఒప్పుకుంటారు.మరి ఒప్పందం ప్రకారం పిల్లి బొమ్మను నారాయణ& కో తీసుకొచ్చిందా? పిల్లి బొమ్మను తీసుకొచ్చే క్రమంలో నారాయణ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు ఆ పిల్లి బొమ్మలో ఏం ఉంది? బ్యాంకులో డబ్బులు కొట్టేసింది ఎవరు? సుభాష్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నదెవరు? ఎస్సై అర్జున్ (అలీ రెజా) వారిని ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ.
విశ్లేషణ: ఈ చిత్రంలో అక్కడక్కడా కనిపించే కొన్ని ఫన్ ఎలిమెంట్స్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తాయి. అలాగే సినిమాలో కనిపించే పాత్రలు కూడా డీసెంట్ గా కనిపిస్తాయి వాటిని ప్రెజెంట్ చేసిన విధానం అయితే బాగుంది. ఇక సీనియర్ నటులు దేవి ప్రసాద్ అలాగే నటి ఆమని లు మంచి స్క్రీన్ స్పేస్ దక్కించుకుని మంచి నటన కనబరిచారు.
అలాగే వారి మధ్య కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇక యంగ్ నటుడు సుధాకర్ ఎప్పటిలానే మంచి నటన సెటిల్డ్ గా కనబరిచాడు. అలాగే మరో నటుడు జై కృష్ణ కూడా మంచి నటన కనబరిచాడు. మెయిన్ గా తన వన్ లైనర్స్ బాగున్నాయి. ఇక ఇతర నటులు పూజా కిరణ్, శివకుమార్ యామిని తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు.
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే సినిమా సెటప్ సెట్ వర్క్స్ నాచురల్ గా ఉన్నాయి. ఇక టెక్నీకల్ టీం లో నాగ వంశీ, సురేష్ బొబ్బిలి, జోశ్యభట్ల శర్మ ల సాంగ్స్ బాగున్నాయి. అలాగే రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక ఎడిటింగ్ నీట్ గా ఉంది. ఇక దర్శకుడు చిన్న పాపిశెట్టి విషయానికి వస్తే..తాను రాసుకున్న కథ ఎంచుకున్న నటీనటులు బాగా కుదిరాయి. సినిమాలో ఫస్టాఫ్ లో చాలా హిలెరియస్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “నారాయణ&కో” చిత్రం గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మెయిన్ లీడ్ నటన, కామెడీ అన్ని ఈ సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. మొత్తంగా ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా నారాయణ & కో.