ఎంచుకున్న పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే స్టార్స్ లో నాని ఒకరు. అష్టాచమ్మ సినిమాతో హీరోగా తన కెరీర్ మొదలు పెట్టినా అసలు అతను పరిశ్రమలోకి వచ్చిన నాని మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలా అసిస్టెంట్‌గా చేస్తున్న టైంలో ఇంద్రగంటి మోహనకృష్ణ నానిని హీరోగా పరిచయం చేశారు. మెయిన్ గోల్ హీరోయినే అయినా వచ్చిన ఛాన్స్ వదలకూడదు అన్నట్టుగా దర్శకత్వ శాఖలో పని చేశాడు నాని. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టి హీరోగా మారిన నాని అష్టా చమ్మా నుంచి కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తెర మీద నానిని చూడగానే మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. అదే అతనికి ప్లస్ పాయింట్. ఇక ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. అందుకే అతని సినిమాలు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేలా చేశాయి. తన సహజ నటనకు న్యాచురల్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ ని కూడా వచ్చేలా చేసింది. అష్టాచమ్మా నుంచి మొదలైన నాని సినీ జర్నీ ఈ మార్చిలో వచ్చిన దసరా వరకు కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. ముఖ్యంగా దసరాతో తన వల్ల కాదని అనుకున్న మాస్ ఫీట్ కూడా సూపర్ హిట్ కొట్టి సత్తా చాటాడు నాని. ప్రతి సినిమాకు తన పరంగా 100కి 100 శాతం కష్టపడి పనిచేసిన నాని హిట్ అయిన సినిమాను ప్రోత్సాహంగా తీసుకుని ఫెయిల్ అయిన సినిమాతో పాఠాలు నేర్చుకుని కెరీర్ కొనసాగిస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన నాని న్యాచురల్ స్టార్ గా 15 ఏళ్లు సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించడంలో అతని ప్రతిభ ఏంటన్నది చెప్పొచ్చు. నాని సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. నాని సినిమా కచ్చితంగా బాగుంటుంది అని నమ్మే ఆడియన్స్ అతని సినిమాలన్నీ రెగ్యులర్ గా చూస్తుంటారు. నాని చేసిన 29 సినిమాల్లో నాని కొత్త వారితో చేసిన సినిమాలే ఎక్కువ. తన కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దసరా సినిమాతో కూడా శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడిని పరిచయం చేశాడు నాని. టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ నాని అలా కూడా తన మంచి మనసు చాటుకుంటున్నాడు. సినీ పరిశ్రమలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న నానికి శుభాకాంక్షలు!!
15 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న నాని!
